Navamasalu Mosi Song Lyrics in Telugu | Naa Kaduko Bangaru Tandri lyrics in Telugu | Erra Sainyam Movie Song Lyrics in Telugu

నవమాసాలు మోసి సాంగ్ లిరిక్స్ తెలుగు లో
Navamasalu Moosi Song Lyrics In Telugu 


Track Name: Navamasalu
Album: Erra Sainyam
Artist: S. Janaki


 ఆమె
నవమాసాలు మోసి
పురిటి నొప్పుల తోటి
పురుడోసుకున్నా...
నీ బొడ్డు కోసి ముద్దు పేరెట్టుకున్నా
తలకు కొరివి పెట్టి
తల్లి రుణం తీర్చు
తనయుడనుకున్నా...
ఏలేటాని కాడు గాల
నీ నిండు ప్రాణం మింగెనా...
ఆ... ఆ... ఆ... ఆ...
నూట అక్షరమొక్కటైనా
నూర్చుకొని జనం లోన
ఇంగీలిసు సదువుతుంటేరో...
నా కొడుకో బంగారు తండ్రీ
నువ్వు కలకటేరు అనుకొంటిరో...
(వీరుడో మా బిడ్డడా)
పల్లె తల్లి సద్ది గడ్డె
తందెళ్ళు తోవ జూపె
చిలకమ్మ సైగ చేసి
లొద్దుల్లో పొద్దు జూసి
తిరిగి నువ్వు వస్తావుంటేరో...
నా కొడుకో బంగారు తండ్రీ
నిన్ను చెట్టుకు కట్టేసి కాల్చారా...
నీ తల్లి పేగును మట్టి కలిపారా...
నున్నంగా తల దువ్వి
సన్ననేత చొక్కా దొడిగి
సందె ఏంట పోతావుంటేరో...
నా కొడుకో బంగారు తండ్రీ
నువ్వు గవినేరు అనుకొంటిరో...
(వీరుడో మా బిడ్డడా)
ఆడి పాడి ప్రాయమందున
ఎర్ర బాటను నడిచినావు
కోరన్నల జాడ జెప్పని
చిత్ర హింసలు పెట్టినా
గుట్టు బయట పెట్టలేదయ్యో...
నా కొడుకో బంగారు తండ్రీ
నువ్వు గుండుకే గుండెను జూపావా...
ఈ అమ్మ గుండెను పిండి జేశావా...
ఆ... ఆ... ఆ... ఆ...
అతడు 
పిచ్చోరా పిడుగోలే
శత్రువును ఛేదించి
పులిలా నువ్వు వస్తావుంటేరో...
నా కొడుకో బంగారు తండ్రీ
నువ్వు కొమరము భీమనుకొంటిరో...
(వీరుడో మా బిడ్డడా)
పడమటి కొండల్లో ప్రాణాలు ఇచ్చినావు
తూర్పు కొండల్లో తొలి పొద్దై పొడిచినావు
విప్లవాల వేగు చుక్కవురో...
నా కొడుకో బంగారు తండ్రీ
జాతి నిన్ను మరువబోదురో...
మా ఎర్ర దండాలందుకొనరా రో...
(వీరుడో మా బిడ్డడా)
మా ఎర్ర దండాలందుకొనరారో...

This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు